మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..పీజీ విద్యార్థులు, ఫ్యాకల్టీకి డీఎంఈ సర్క్యులర్

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..పీజీ విద్యార్థులు, ఫ్యాకల్టీకి డీఎంఈ సర్క్యులర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) సర్క్యులర్ జారీ చేశారు.  ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చాలామంది పీజీ విద్యార్థులు టీజీఎంసీ రిజిస్ట్రేషన్ తీసుకోలేదని, కొందరు ఫ్యాకల్టీ సభ్యులు రెన్యూవల్ చేయించుకోలేదని వెల్లడించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రతి డాక్టర్‌‌‌‌కు మెడికల్ కౌన్సిల్ గుర్తింపు (రిజిస్ట్రేషన్) ఉండటం చట్టప్రకారం తప్పనిసరని స్పష్టం చేశారు. అర్హులైన పీజీ విద్యార్థులందరూ డిసెంబర్ 31 లోపు రిజిస్ట్రేషన్ పొందాలని ఆదేశించారు. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల ఫ్యాకల్టీ తమ రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో ఉండేలా చూసుకుని, అవసరమైన చోట రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్స్, మెడికల్ సూపరింటెండెంట్లు తమ సంస్థల పరిధిలోని పీజీ విద్యార్థులు, ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ స్టేటస్‌‌‌‌ ను పరిశీలించాలన్నారు.పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ వివరాలతో సమగ్ర నివేదికను నిర్వహించి, డిసెంబర్ 31 నాటికి డీఎంఈకి సమర్పించాలని తెలిపారు. ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని పేర్కొన్నారు.