టెన్త్ సర్టిఫికెట్ల సవరణ ఇక మీ-సేవ ద్వారానే..డీఈఓలు, ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు

టెన్త్ సర్టిఫికెట్ల సవరణ ఇక మీ-సేవ ద్వారానే..డీఈఓలు, ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఒరిజినల్ టెన్త్ సర్టిఫికెట్లలోని వివరాల సవరణకు ఇకపై మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల సవరణ దరఖాస్తులన్నీ మీ-సేవ ద్వారా ఆన్‌‌లైన్‌‌లోనే సమర్పించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఈఓలు,ఎంఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 

ఒరిజినల్ ఎస్ఎస్‌‌సీ సర్టిఫికెట్లలోని వివరాల సవరణకు మీ-సేవ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు, ప్రాసెసింగ్ సదుపాయం అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఫిజికల్‌‌గా స్వీకరించడం, పరిశీలించడం,  డైరెక్టరేట్‌‌కు ఫార్వార్డ్ చేయడం గానీ చేయకూడదని హెడ్మాస్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని డీఈఓలకు డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించా రు. ఒకవేళ ఎవరైనా మాన్యువల్ ప్రతిపాదనలు పంపినా డైరెక్టర్ కార్యాలయంలో వాటిని పరిగణనలోకి తీసుకోబోమన్నారు.