నల్గొండ ఐటీఐ విద్యార్థినికి జాతీయ సత్కారం.. అభినందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

నల్గొండ ఐటీఐ విద్యార్థినికి జాతీయ సత్కారం.. అభినందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న రేణుక

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఈ) పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నిర్వహించిన ‘ఆలిండియా ట్రేడ్ టెస్ట్ – 2026’లో ప్రభుత్వ ఐటీఐ నల్గొండ విద్యార్థిని గంట రేణుక జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ‘ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టూల్స్’ (ఇంజినీరింగ్ డిజైన్ టెక్నాలజీ) ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రథమ శ్రేణిలో నిలిచారు.

ఈ సందర్భంగా 5వ ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ వేడుకలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. రేణుకను మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ట్రైనింగ్ కాంతి వెస్లీ ప్రత్యేకంగా అభినందించారు.