సూర్యాపేటలో విషాద ఘటన.. ఒకే స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా టిప్పర్ కొట్టేసి ఇద్దరు టీచర్లు మృతి

సూర్యాపేటలో విషాద ఘటన.. ఒకే స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా టిప్పర్ కొట్టేసి ఇద్దరు టీచర్లు మృతి

మేళ్లచెరువు, వెలుగు: టిప్పర్​ ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు టీచర్లు మృతిచెందిన ఘటన సూర్యాపేట పట్టణంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చివ్వెంల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ప్రిన్సిపాల్​ కోట్ల రజితారెడ్డి (44), టీచర్​ గుగులోతు రక్మా (40) ఒకే స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా, బీబీగూడెం నుంచి మార్కెట్​కు వెళ్లే రహదారిపై టిప్పర్​ లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు తీవ్రంగా గాయపడి స్పాట్​లోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్పీ నర్సింహా, పట్టణ సీఐ వెంకటయ్య, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్​ను పీఎస్​కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.