హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీసెమీస్లో లక్ష్యసేన్

హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీసెమీస్లో లక్ష్యసేన్

కౌలూన్‌‌‌‌:  ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌.. హాంకాంగ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో లక్ష్య 21–17, 10–21, 21–13తో లోహ్‌‌‌‌ కీన్‌‌‌‌ యీవ్‌‌‌‌ (సింగపూర్‌‌‌‌)పై గెలిచాడు. 55 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ బలమైన స్మాష్‌‌‌‌లు, ర్యాలీలతో హోరెత్తించాడు. అయితే రెండో గేమ్‌‌‌‌లో ప్రత్యర్థి  పుంజుకోవడంతో ఇబ్బందిపడినా.. డిసైడర్‌‌‌‌లో మళ్లీ చెలరేగాడు. 

మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి 21–12, 13–21, 21–16తో హు కే యువాన్‌‌‌‌–లిన్‌‌‌‌ జియాంగ్‌‌‌‌ (చైనా)పై పోరాడి నెగ్గారు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ 17–21, 7–21తో కున్లావట్‌‌‌‌ వితిడార్సన్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో, విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో రక్షిత రామరాజ్‌‌‌‌ 19–21, 16–21తో పోర్న్‌‌‌‌పావీ చోచువోంగ్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో ఓడారు.