రావల్పిండి: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న పాకిస్తాన్.. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ఫలితంగా ఈ ఫార్మాట్‌లో రెండేళ్ల తర్వాత పాక్‌కు సిరీస్ దక్కడం ఇదే తొలిసారి.
లంక నిర్దేశించిన 90 రన్స్ లక్ష్య ఛేదనలో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 90/2 స్కోరు చేసి నెగ్గింది. అజాన్ అవైస్ (32 నాటౌట్), ఆమెర్ జమల్ (34 నాటౌట్) మెరుగ్గా ఆడారు. అసితా ఫెర్నాండో, లాహిరు కుమార చెరో వికెట్ తీశారు. అంతకుముందు 309/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లలో 316 రన్స్‌కు ఆలౌటైంది.
