టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్ టూర్ పైలట్ టోర్నీలో అర్జున్ ఓటమి

టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్ టూర్ పైలట్ టోర్నీలో అర్జున్ ఓటమి

బుడాపెస్ట్‌‌‌‌: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. టోటల్‌‌‌‌ చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టూర్‌‌‌‌ పైలట్‌‌‌‌ టోర్నీలో ఓటమిని నమోదు చేశాడు. శుక్రవారం తొమ్మిదో స్థానం కోసం జరిగిన పోరులో అర్జున్‌‌‌‌ 5.5–14.5 తేడాతో హైక్‌‌‌‌ మార్టిరోసియన్‌‌‌‌ చేతిలో ఓడాడు. తొలి మూడు బ్లిట్జ్‌‌‌‌ గేమ్‌‌‌‌లు గెలిచి నాలుగోది డ్రా చేసుకున్న అర్జున్‌‌‌‌ 3.5–0.5తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ మార్టిరోసియన్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌లో ఒక విజయం, ఒక డ్రాతో పుంజుకున్నాడు. 

తర్వాత నల్లపావులతో ఫాస్ట్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌ గెలిచి 14.5–5.5తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 23వ స్థానం కోసం జరిగిన పోరులో ఆర్‌‌‌‌. వైశాలి 4–16తో నొడిర్బెక్‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌ చేతిలో ఓడింది. 21వ స్థానం కోసం జరిగిన పోరులో ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద 12–8తో అభిమన్యు మిశ్రాపై నెగ్గాడు. బ్లిట్జ్‌‌‌‌ గేమ్‌‌‌‌లు 2–2తో సమం కాగా, తొలి ర్యాపిడ్‌‌‌‌లో గెలిచిన ప్రజ్ఞానంద.. తర్వాతి ర్యాపిడ్‌‌‌‌, ఫాస్ట్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌ గేమ్‌‌‌‌లను డ్రా చేసుకున్నాడు.