ఫిడే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరులో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్, జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) మధ్య గట్టి పోటీ జరగనుంది. ఈ నెల 24 ఈ మ్యాచ్ జరగనుంది. 2024 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో డింగ్ లీరెన్ (చైనా)పై గెలిచి గుకేశ్ టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించగా, వరల్డ్ కప్, క్యాండిడేట్స్ టోర్నీలో విజయాలతో సిందరోవ్ తుది దశకు చేరుకున్నాడు.
అయితే గుకేశ్ 2710 పాయింట్ల రేటింగ్‌తో 26వ స్థానంలో ఉండగా, సిందరోవ్ 2782 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇద్దరి మధ్య 72 పాయింట్ల వ్యత్యాసం ఉండటం వల్ల సిందరోవ్ వైపు మొగ్గు కనిపిస్తోంది. వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత గుకేశ్ ఆటతీరు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంది. సిందరోవ్ మాత్రం కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్, ర్యాంక్‌తో జోరుమీదున్నాడు.
ఈ చాంపియన్‌షిప్‌లో 14 క్లాసికల్ గేములు ఉంటాయి. 7.5 పాయింట్లు సాధించిన వారు విజేతగా నిలుస్తారు. ఇద్దరి స్కోర్లు సమమైతే తక్కువ టైమింగ్ కలిగిన గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మొత్తం ప్రైజ్‌మనీ 2.5 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 23 కోట్లు)గా ఉంది.
