- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సత్కారం
వికారాబాద్, వెలుగు: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్షా’ కార్యక్రమంలో భాగంగా, అంతర్జాతీయ 95–-95–-95 లక్ష్యాలను విజయవంతంగా చేరుకొని ‘సురక్షిత్’ హోదా పొందింది. ఈ ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1న న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం-2026 వేడుకల్లో జిల్లాను సత్కరించనుంది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రితు శర్మ శుక్రవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారికీ ఆహ్వానం పంపించారు. కలెక్టర్‌తో పాటు సివిల్ సర్జన్, సీఎంహెచ్‌ఓ, డీఎంహెచ్‌ఓ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి బృందాన్ని కార్యక్రమానికి ఆహ్వానించారు. గతంలో ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
