మెదక్ టౌన్: ప్రభుత్వ బిల్లులు, ఉద్యోగాలిప్పిస్తానని రూ.20.70 లక్షల మోసం

మెదక్ టౌన్: ప్రభుత్వ బిల్లులు, ఉద్యోగాలిప్పిస్తానని రూ.20.70 లక్షల మోసం
  •      సెక్రటేరియెట్ ఉద్యోగిగా నమ్మించి బురిడీ

మెదక్ టౌన్, వెలుగు:  ప్రభుత్వ బిల్లులు క్లియర్ చేయించడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరి వద్ద రూ.20.70 లక్షలు వసూలు చేసి మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్ తెలిపారు. మెదక్ పట్టణంలోని పిట్లంబేస్ వీధికి చెందిన అలకంటి యశ్వంత్‌‌‌‌‌‌‌‌కు.. ఆటోనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ కాంట్రాక్టర్ మ్యాడమ్ శివరాములుతో పరిచయం ఏర్పడింది. శివరాములుకు సుమారు రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని తెలుసుకున్న యశ్వంత్.. తాను సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగం చేస్తున్నానని, 10 శాతం కమిషన్ ఇస్తే బిల్లులు క్లియర్ చేయిస్తానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన శివరాములు 2025 అక్టోబర్ 14న యశ్వంత్ తండ్రి అలకంటి మహేశ్ పేరుతో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ చేశారు. బిల్లులు క్లియర్ కాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినా యశ్వంత్ తప్పించుకు తిరుగుతున్నాడు.

నకిలీ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ లెటర్‌‌‌‌‌‌‌‌తో మోసం

గతంలో ఆర్టీసీ బస్సులో పరిచయమైన నర్సాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మెయ్యడి దశరథ్‌‌‌‌‌‌‌‌కు.. విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి యశ్వంత్ రూ.10.70 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం కోసం నిలదీయడంతో నకిలీ నియామక పత్రం పంపి మోసం చేశాడు. బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.20.70 లక్షలను యశ్వంత్, అతడి తండ్రి మహేశ్ వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నట్లు దర్యాప్తులో తేలిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.