గ్రామీణ రోడ్లతో విప్లవాత్మక మార్పులు : ఏడీబీ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ దొడ్ల శివరాజు

గ్రామీణ రోడ్లతో విప్లవాత్మక మార్పులు :  ఏడీబీ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ దొడ్ల శివరాజు

హైదరాబాద్, వెలుగు: భారత్‌‌‌‌‌‌‌‌తో నాలుగు దశాబ్దాల భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కీలక పాత్ర పోషించిందని ఆ సంస్థ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ స్పెషలిస్ట్ దొడ్ల శివరాజు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘1986లో భారత్‌‌‌‌‌‌‌‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడీబీ.. గడిచిన 40 ఏండ్లల్లో  24 రాష్ట్రాలు, పలు జాతీయ కార్యక్రమాలకు సుమారు 63 బిలియన్ డాలర్ల(సుమారు రూ.5.84 లక్షల కోట్లు) ఆర్థిక సహాయాన్ని అందించింది. 

ప్రధానమంత్రి సడక్ యోజన కింద 2003 నుంచి ఏడు రుణాల ద్వారా 2.31 బిలియన్ డాలర్లు(సుమారు ₹21,404 కోట్లు) మంజూరు చేసింది. దీనివల్ల అస్సాం, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 44,970 కి.మీ. మేర రోడ్లు నిర్మితమయ్యాయి’ అని వివరించారు. ఈ రహదారుల వల్ల 11,195 ఆవాస ప్రాంతాల్లోని కోటి మందికి పైగా ప్రజలకు విద్య, వైద్యం, మార్కెట్ సదుపాయాలు చేరువయ్యాయని చెప్పారు.. ఆధునిక, వాతావరణ అనుకూల సాంకేతికతలతో నిర్మించిన రోడ్లు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చాయని దొడ్ల శివరాజు పేర్కొన్నారు.