దావూద్ గ్యాంగ్ సభ్యుడి ఎన్ కౌంటర్..బులంద్‌‌‌‌షహర్‌‌‌‌లో పోలీసుల ఆపరేషన్‌‌‌‌

దావూద్ గ్యాంగ్ సభ్యుడి ఎన్ కౌంటర్..బులంద్‌‌‌‌షహర్‌‌‌‌లో పోలీసుల ఆపరేషన్‌‌‌‌

న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌‌‌‌తో సంబంధాలున్న గ్యాంగ్‌‌‌‌స్టర్ నసీమ్ దుర్రానీ పోలీసుల ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో హతమయ్యాడు. గురువారం రాత్రి బులంద్‌‌‌‌షహర్‌‌‌‌లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, యూపీ ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా క్యాంప్ ఆఫీస్ బయట జరిగిన హత్య కేసులోనూ దుర్రానీ నిందితుడిగా ఉన్నాడు. చోటా షకీల్ ఆదేశాలతో జర్నలిస్ట్ తారెక్ ఫతా, గ్యాంగ్‌‌‌‌స్టర్ చోటా రాజన్‌‌‌‌లను హత్య చేసేందుకు కాంట్రాక్టులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తారెక్ ఫతా కదలికలపై నోయిడాలో రెక్కీ కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. సికంద్రా బైపాస్ దగ్గర స్కూటర్‌‌‌‌పై వెళ్తున్న దుర్రానీని పోలీసులు చుట్టుముట్టగా, రెండు తుపాకులతో కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు.