న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) 4 ఫైటర్ జెట్స్‌ను కోల్పోయిందంటూ బ్రిటిష్ ఏవియేషన్ మ్యాగజైన్ ‘ఫ్లైట్‌గ్లోబల్’ వివాదాస్పద కథనం ప్రచురించింది. భారత్ మొత్తం 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసిందని, అందులో ఇప్పుడు 32 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై ఐఏఎఫ్ మాజీ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ తీవ్రంగా స్పందించారు. తప్పుడు వార్తలు, ఆధారాల్లేని విషయాలను ప్రచారం చేయొద్దంటూ ‘ఎక్స్’లో మండిపడ్డారు.
ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటివరకు 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. అయితే ఫ్లైట్‌గ్లోబల్ తాజా వరల్డ్ ఎయిర్ ఫోర్సెస్ డైరెక్టరీలో వీటి సంఖ్యను 32గా చూపించింది. గత ఏడాది ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రచురించిన నివేదికలోనూ 35 విమానాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. తాజా నివేదికలో 4 విమానాలు తగ్గడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నివేదిక ఆధారంగా పాకిస్తాన్ మీడియా భారత్ నాలుగు రఫేల్ విమానాలను కోల్పోయిందన్న వాదనను మరోసారి ప్రచారం చేసింది.
