కావా వాలీబాల్‌‌‌‌ క్లబ్ చాంపియన్షిప్ తెలుగు బ్లాక్ ‌‌‌హాక్స్ జోరు

కావా వాలీబాల్‌‌‌‌ క్లబ్ చాంపియన్షిప్ తెలుగు బ్లాక్ ‌‌‌హాక్స్ జోరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రతిష్టాత్మక కావా వాలీబాల్‌‌‌‌ క్లబ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో.. ప్రైమ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ (పీవీఎల్‌‌‌‌) ఫ్రాంచైజీ జట్టు తెలుగు బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌ 3–1 తేడాతో ముంబై మీటియర్స్‌‌‌‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌‌‌‌లో తొలి సెట్‌‌‌‌ను బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌ 20–25తో కోల్పోయినా.. తర్వాత 25–19, 25–22, 25–18తో వరుస సెట్లలో విజయం సాధించింది. 

శనివారం జరిగే సెమీస్‌‌‌‌లో బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌.. పూలాడ్‌‌‌‌ సిర్జాన్‌‌‌‌ (ఇరాన్‌‌‌‌) లేదా బెంగళూరు టార్పెడోస్‌‌‌‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో తెలుగు బ్లాక్‌‌‌‌హాక్స్ సెమీఫైనల్‌‌‌‌కు చేరడం జట్టుకు మాత్రమే కాకుండా ఇండియా వాలీబాల్‌‌‌‌కు కూడా గర్వకారణమ‌‌‌‌ని ఆ జ‌‌‌‌ట్టు య‌‌‌‌జ‌‌‌‌మాని కంక‌‌‌‌ణాల అభిషేక్ రెడ్డి అన్నారు. సెమీస్‌‌‌‌కు చేరిన బ్లాక్‌‌‌‌హాక్స్ జ‌‌‌‌ట్టును ఆయ‌‌‌‌న‌‌‌‌ అభినందించారు.