- బర్డ్ ఫ్లూకు స్వదేశీ వ్యాక్సిన్..
- భోపాల్‌లో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి చౌహాన్
భోపాల్: బర్డ్ ఫ్లూ బారి నుంచి కోళ్లను రక్షించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 వ్యాక్సిన్‌ను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం భోపాల్‌లో ఆవిష్కరించారు. ఇక్కడి ఐసీఏఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలోని క్లేడ్ 2.3.2.1ఏ రకానికి చెందిన హెచ్5ఎన్1 వైరస్‌ను ఎదుర్కొనేం దుకు భారత్‌లో రూపొందించిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఇదేనని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పశు ఆరోగ్య రక్షణ, బర్డ్ ఫ్లూ నివారణ రంగంలో ఈ దేశీయ వ్యాక్సిన్ దేశానికి కీలక మైలురాయి అని పేర్కొన్నారు.
