ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ దొరికిన  వార్డు ఆఫీసర్

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ దొరికిన  వార్డు ఆఫీసర్

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని రావల్‌కోల్ వార్డు పరిధిలో పనిచేస్తున్న వార్డు ఆఫీసర్ రవీందర్ రెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

అసెస్మెంట్ పనికి సంబంధించి ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలో రవీందర్ రెడ్డిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

అనంతరం ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులు, సంబంధిత పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల తదుపరి చర్యలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.