వైఎస్ షర్మిల కుమార్తె అంజలీ రెడ్డి హల్దీ వేడుకలు!

వైఎస్ షర్మిల కుమార్తె అంజలీ రెడ్డి హల్దీ వేడుకలు!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూతురు అంజలి రెడ్డి వివాహం నవంబర్ 25న జరగనున్న సంగతి తెలిసిందే. మొదట బెంగుళూరులోని యలహంక భవనంలో అంజలి రెడ్డి వివాహం జరపాలని నిశ్కాయించినప్పటికీ జగన్ అభ్యంతరం చెప్పడంతో వేదికను మార్చారు.

అయితే వివాహ వేదికను ఇప్పటివరకు బయటికి ప్రకటించలేదు.వివాహ వేదిక గురించి క్లారిటీ లేనప్పటికీ అంజలి రెడ్డి హల్దీ ఫంక్షన్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో అంజలి వివాహం గతంలోనే నిర్ణయించారు. హల్దీ వేడుకలో అంజలి రెడ్డి వెంట షర్మిల, ఆమె భర్త అనిల్ ఉన్నారు సహా కుటంబసభ్యులు ఉన్నారు. ఈ ఫోటోలను కాంగ్రెస్ పార్టీ నాయకులఠీ సహా టీడీపీ నేతలు కూడా విస్తృతంగా ఛాఋఏ చేస్తున్నారు.

అంజలి, రఘురాం రెడ్డిలది పెద్దలు కుదిర్చిన వివాహమే.. రఘురాం రెడ్డి ఫ్యామిలీ చాలా ఏళ్ళ క్రితం మెరికకు వెళ్లి సెటిల్ అయ్యింది. రఘురాం కుటుంబానిది వ్యాపార నేపథ్యం. రఘురాం రెడ్డి అమెరికాలో డాక్టర్ గా స్థిరపడ్డారు. రఘురాం, అంజలి వివాహాన్ని బెంగళూరులోనే నిర్వహించాలని షర్మిల ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోవడంతో.. వేరే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. 

పెళ్లి తర్వాత హైదరాబాద్ లో అంజలి, రఘురాంల రిసెప్షన్ నిర్వహిస్తారని సమాచారం. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల  నుంచి రాజకీయ ప్రముఖులు, వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరవుతారని తెలుస్తోంది.