శ్రీశైలంలో కోటి దీపోత్సవం : వేల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!

శ్రీశైలంలో కోటి దీపోత్సవం : వేల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!

Koti Deepotsavam: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న సన్నధిలో కోటి దీపోత్సవం ఏర్పాటు చేసింది ఆలయం. 2026, నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఈ వేడుక నిర్వహించటానికి.. భారీ ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. శ్రీశైలంలోని ఆగమ పాఠశాల ఎదురు ఉన్న ఖాళీ స్థలంలో.. కోటి దీపోత్సవానికి సంబంధించి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు అధికారులు. కోటి దీపోత్సవం సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

శ్రీశైలంలో కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని.. సాయంత్రం 5 గంటల నుంచి ప్రముఖ సినీ గాయకుడు మనో బృందంతో భక్తి సంగీతం ఉంటుందని దేవస్థానం వెల్లడించింది. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులు అందరూ సాయంత్రం 5 గంటల నుంచి తరలిరావాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. 

శ్రీశైలంలో శివయ్య సన్నిధిలో.. కోటి దీపోత్సవానికి ఇప్పటికే చాలా మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనంతోపాటు కార్తీక మాసం దీపాలు వెలిగించొచ్చు అన్న భక్తితో.. శ్రీశైలం చేరుకుంటున్నారు. కోటి దీపోత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అధికారులు ప్రకటించారు.

►ALSO READ | కూటమి పార్టీల మధ్య జెడ్పీ సీట్ల పంపకాలు ఖరారు.. టీడీపీకి 21, జనసేనకు 4, బీజేపీకి ఒకటి..!