తీరం దాటుతున్న అక్వాన్‌ తుఫాన్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తీరం దాటుతున్న అక్వాన్‌ తుఫాన్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటుతుంది. తుఫాన్ బాహ్య వలయం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను తాకింది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌ సమీపంలో తుపాన్ పూర్తిగా తీరం దాటనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 21 కిలో మీటర్ల వేగంతో తుపాన్ కదులుతుంది. ప్రస్తుతానికి ఇది కళింగపట్నంకి 110 కి.మీ, విశాఖపట్నంకి 170 కి.మీ, గోపాల్‌పూర్‌కి 170 కి. మీ, పూరీకు 250 కి.మీ, నరసాపురానికి 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఇవాళ(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన చేసింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఇప్పటికే వర్షం పడుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 16 సెం.మీ, కంచిలి, కవిటిలో 10 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోంపేటలో 9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరులో 4.9సెం.మీ వర్షపాతం నమోదైంది.