ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే ఫొటోను పొరపాటున చించివేసి తీవ్ర వివాదంలో చిక్కుకున్న శివసేన (షిండే వర్గం) నాయకురాలు షైనా ఎన్సీ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ఘటన జరిగిన 24 గంటల తర్వాత గురువారం ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో వీర సావర్కర్‌ను చిత్రీకరించిన తీరుకు నిరసనగా షైనా ఎన్సీ బుధవారం ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కెమెరాల ముందు ఉద్ధవ్ ఠాక్రే ఫొటోను చింపివేశారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ వ్యవస్థాపకుడి ఫొటోనే చించారంటూ ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తొలుత ఈ ఆరోపణలను ఖండించిన షైనా, తాను కేవలం మణిశంకర్ అయ్యర్ ముఖాన్ని మాత్రమే చించానంటూ ఒక ఏఐ ఫొటోను పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు.
