ఆస్తి వివాదంలో తండ్రిపై వేధింపులు.. కొడుకులు, కుటుంబ సభ్యులతో సహా 14 మందిపై కేసు

ఆస్తి వివాదంలో తండ్రిపై వేధింపులు.. కొడుకులు, కుటుంబ సభ్యులతో సహా 14 మందిపై కేసు

దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి ప్రకాశ్‌‌‌‌నగర్ కాలనీకి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నార్లపాటి వెంకటేశ్వరరావు (76) ఆస్తి వివాదంలో తన కుమారులు, కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు, దాడులు, హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్నానని పోలీసులను ఆశ్రయించారు.

ఈ నెల 16న రాత్రి తనపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారని, తనకు చెందిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు, బంగారం తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని, నకిలీ పత్రాలతో ఇతరులను మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణరక్షణ కల్పించి ఆస్తి పత్రాలు ఇప్పించాలని కోరడంతో, ఈనెల18న రాత్రి దమ్మపేట పోలీసులు తన కుమారులు సునీల్ కుమార్, అజయ్ కుమార్ తో సహా 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.