మహిళలే వచ్చి అండాలు ఇచ్చారు..హైకోర్టులో డాక్టర్‌‌ పద్మజ అడ్వకేట్ వాదన

మహిళలే వచ్చి అండాలు ఇచ్చారు..హైకోర్టులో డాక్టర్‌‌ పద్మజ అడ్వకేట్ వాదన

హైదరాబాద్, వెలుగు: అండాల సేకరణ వ్యవహారంలో పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని పద్మజ ఫెర్టిలిటీ సెంటర్‌‌కు చెందిన డాక్టర్‌‌ పి.పద్మజ గురువారం హైకోర్టుకు నివేదించారు. డాక్టర్‌‌గా కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రతిష్టలను ఒక్క తప్పుడు కేసు ఆధారంగా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మజ దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌‌పై జస్టిస్‌‌ నందికొండ నర్సింగ్‌‌రావు గురువారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌‌ న్యాయవాది హేమేంద్రనాథ్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రక్షించామని చెబుతున్న మహిళలు బాధితులు కాదని, ఆర్థిక ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా అండాలను దానం చేయడానికి వచ్చారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ కల్పితమైనవని తెలిపారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చారన్నారు. పిటిషనర్‌‌ దర్యాప్తునకు సహకరిస్తారని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.