కోట నీలిమకు ఓవైసీ క్షమాపణ చెప్పాలి..రసూల్‌ పురలో కాంగ్రెస్ ఆందోళన

కోట నీలిమకు ఓవైసీ క్షమాపణ చెప్పాలి..రసూల్‌ పురలో కాంగ్రెస్ ఆందోళన

సికింద్రాబాద్​, వెలుగు: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్​చార్జి డాక్టర్ కోట నీలిమపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. గురువారం సికింద్రాబాద్‌లోని రసూల్‌పుర చౌరస్తాలో సనత్‌నగర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 

ఓవైసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు.