పద్మారావునగర్, వెలుగు : రైల్వే ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, విధులపై అవగాహన కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ప్రత్యేక చొరవ తీసుకుంది. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక సదస్సును నిర్వహించింది. ద.మ.రై ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే నేతృత్వంలో నాలుగు విడతలుగా జరిగిన ఈ సదస్సుకు మూడు డివిజన్లు, హెడ్డాఫీసుకు చెందిన సుమారు 400 మంది మహిళా ఉద్యోగులు హాజరయ్యారు.
ఇతి పాండే మాట్లాడుతూ వాణిజ్య విభాగం సాధించిన విజయాల్లో మహిళా సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. సదస్సును విజయవంతంగా నిర్వహించిన వాణిజ్య విభాగాన్ని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.
