పణజి: దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 22న గోవాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ‘చల్లా కితేమ్, గోవా’ (గోవాలో ఏమవుతోంది?) పేరుతో పణజిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సీజేపీ గోవా నాయకురాలు అఫ్రీన్ షేక్ తెలిపారు. స్థానిక సమస్యలను ప్రజలు నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం వేదికగా నిలుస్తుందన్నారు. యువత ఏయే సమస్యలపై పనిచేయాలో ప్రజల నుంచే తెలుసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ హాజరవుతారని వెల్లడించారు.
