జీటీఏ 6 రిలీజ్.. విడుదలకు ముందే 1.7 కోట్ల కాపీల సేల్

జీటీఏ 6 రిలీజ్.. విడుదలకు ముందే 1.7 కోట్ల కాపీల సేల్
  • ఇప్పటికే రూ.15,675 కోట్ల ఆదాయం 
  • గేమ్‌‌‌‌ బడ్జెట్‌‌‌‌ను మించిన వసూళ్లు
  • ఖర్చు రూ.9,300 వేల కోట్లని అంచనా 
  • 13 ఏళ్ల తరువాత కొత్త వెర్షన్​

న్యూఢిల్లీ:  గేమింగ్‌‌‌‌ లవర్స్ ​ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్‌‌‌‌ తెఫ్ట్‌‌‌‌ ఆటో (జీటీఏ) 6 విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత ఈ గేమ్​కు కొత్త వెర్షన్‌‌‌‌ రావడంతో అభిమానుల్లో భారీ సందడి నెలకొంది. కొందరు ఉద్యోగులు గేమ్‌‌‌‌ ఆడేందుకు సెలవులు తీసుకుంటుండగా, మరికొందరు కుటుంబ సభ్యులు తమకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు డబ్బులు ఇస్తున్నట్లు సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ గేమ్‌‌‌‌ తయారీకి పదేళ్లకు పైగా సమయం పట్టింది. జీటీఏ​ డెవలపర్​ రాక్‌‌‌‌స్టార్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ అధికారికంగా తయారీ ఖర్చును వెల్లడించలేదు.  అయితే బడ్జెట్ ​బిలియన్‌‌‌‌ డాలర్లకు (దాదాపు రూ.9,300 కోట్లు)పైగా ఉంటుందని అంచనా. 

సెన్సార్‌‌‌‌ టవర్‌‌‌‌ లెక్కల ప్రకారం విడుదలకు ముందే 1.7 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా 1.65 బిలియన్‌‌‌‌ డాలర్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. ఇందులో 75 శాతం అమ్మకాలు సోనీ పీఎస్‌‌‌‌5 ద్వారా, మిగిలినవి మైక్రోసాఫ్ట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌బాక్స్‌‌‌‌ కన్సోళ్లపై జరిగాయి. డిజిటల్‌‌‌‌ అమ్మకాల వివరాలే ఇందులో ఉన్నాయి. ఫిజికల్ కాపీల ఆదాయం కలపలేదు. ఓపెన్‌‌‌‌ హైమర్‌‌‌‌ అంచనా ప్రకారం తొలి 3 రోజుల్లో 1.85 బిలియన్‌‌‌‌ డాలర్ల ఆదాయం రావచ్చు.  

ఏడాది మార్చి నాటికి 6.5 కోట్ల కాపీలు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు.  2027 ప్రారంభంలో పీసీ వెర్షన్‌‌‌‌ విడుదలయ్యే అవకాశం ఉంది. జీటీఏ– 6కు మెటాక్రిటిక్‌‌‌‌లో 99 స్కోర్‌‌‌‌ రావడం విశేషం. జీటీఏ5 ఇప్పటివరకు 23.5 కోట్ల కాపీలు అమ్ముడవగా, మైన్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ 35 కోట్ల అమ్మకాలతో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన గేమ్‌‌‌‌గా కొనసాగుతోంది. భారత్‌‌‌‌లో పీఎస్‌‌‌‌5, ఎక్స్‌‌‌‌బాక్స్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌, ఎస్‌‌‌‌ కన్సోల్స్​ స్టాండర్డ్‌‌‌‌ ఎడిషన్‌‌‌‌ ధర రూ.5,999 కాగా, అల్టిమేట్‌‌‌‌ ఎడిషన్‌‌‌‌ ధర రూ.7,499గా ఉంది.