హైదరాబాద్ టీహబ్‌‌‌‌లో ..గ్లోబల్ సీఎక్స్‌‌‌‌ఓ అవార్డ్స్‌‌‌‌

హైదరాబాద్ టీహబ్‌‌‌‌లో ..గ్లోబల్ సీఎక్స్‌‌‌‌ఓ అవార్డ్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని  టీ-–హబ్ వేదికగా 'గ్లోబల్ సీఎక్స్‌‌‌‌ఓ  అవార్డ్స్ 2026'  వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. 'సీఎక్స్‌‌‌‌ఓ ఇంక్'  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ  కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 250 మందికి పైగా సీఈఓలు, సీఎఫ్‌‌‌‌ఓలు, సీటీఓలు, స్టార్టప్ ఫౌండర్లు, ఇన్వెస్టర్లు హాజరయ్యారు. వ్యాపార, సాంకేతిక రంగాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన సుమారు 100 మంది అత్యుత్తమ కార్పొరేట్ నాయకులను స్వతంత్ర జ్యూరీ ఎంపిక చేసి సత్కరించింది. టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్, ఉమెన్ లీడర్‌‌‌‌షిప్, స్టార్టప్స్ విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేశారు.