పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధిలో.. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక ముందడుగు

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధిలో.. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక ముందడుగు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  వెలుగు: దేశీయ సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐ సెమీకండక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక విజయం సాధించింది. పిలానీలోని సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సీఈఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ  సహకారంతో చేపట్టిన 650 వోల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 20 ఆంపియర్ల సామర్థ్యం గల గాలియం నైట్రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలికాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఎంటీ  పరికరాల అభివృద్ధిలో తొలి వేఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రాథమిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావడంతో తదుపరి పరికర స్థాయి పరీక్షలకు మార్గం సుగమమైంది. 

సంప్రదాయ సిలికాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే తక్కువ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టంతో అధిక సామర్థ్యంతో పనిచేసే ఈ గాలియం నైట్రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరికరాలు ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనాల  ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు, సౌర విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వర్టర్లు, డేటా సెంటర్లు, రక్షణ, ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగాల్లో ఎంతో కీలకం కానున్నాయి. సొంత టెక్నాలజీని మెరుగుపరుచుకోవడంలో   ఇదొక ముఖ్యమైన మైలురాయని సీఈఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ శాస్త్రవేత్త డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిజుస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుందు అన్నారు.