GTA 6 మీమ్స్ తో తమిళనాడు రాజకీయాల్లో రచ్చ రచ్చ

GTA 6 మీమ్స్ తో తమిళనాడు రాజకీయాల్లో రచ్చ రచ్చ

తమిళనాడు రాజకీయాల్లో GTA మీమ్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. అధికార టీవీకే పార్టీ, తమిళనాడు సీఎం విజయ్ పై కొత్తగా వచ్చి GTA  మీమ్స్ తో వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష బీజేపీ, డీఎంకే నేతలు. విజయ్, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ  GTA మీమ్స్ సృష్టించి సోషల్ మీడియాలో పెడుతుండటంతో  తమిళ రాజకీయాల్లో GTA మీమ్స్ రచ్చ ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది.  

తమిళనాడులో ప్రతిపక్ష బీజేపీ నేతలు షేర్ చేస్తున్న  సీఎం విజయ్, టీవీకే ఎమ్మెల్యేల GTA మీమ్స్ పై ఇప్పుడు అంతా చర్చ.. GTA 6 మీమ్స్ తో  విజయ్ ఫోటోలను షేర్ చేస్తున్న బీజేపీ నేతలు. వీటికి విజయ్ పార్ట్ టైం సీఎం అంటూ క్యాప్షన్లు ఇచ్చారు.  వీటితోపాటు టీవీకే హరస్సార్  ఎమ్మెల్యే అధావ్ అర్చున ఫోటోలను షేర్ చేస్తూ  తమిళనాడులో విజయ్ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఊకుమ్మడి  దాడి చేస్తున్నారు బీజేపీ, డీఎంకే పార్టీల నేతలు. 

►ALSO READ | తమిళనాడు ప్రభుత్వంలో ఆంధ్రా కోవర్టులు ఉన్నారా: అందుకేనా 15 మంది అధికారులను సీఎం విజయ్ తీసేశాడు..!