లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సెటైర్లతో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలో జరుగుతున్న జీ3 సమావేశానికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ ప్రధానిపై సెటైర్లు వేశారు. కాంప్రమైజ్ ప్రధాని ఎన్నటికీ ఈ బల్లపై కూర్చోలేరు అంటూ విమర్శించారు. కాంగ్రెస్సే గనక అధికారంలో ఉండి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదని తన X బ్లాగ్ లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుననాయి.
నవంబర్ 20న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో జీ 3 సమావేశంలో పాల్గొన్న ట్రంప్, పుతిన్, జిన్ పింగ్ లు ఉన్న ఫోటోను షేర్ చేశారు. ట్రంప్, షీ జిన్పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే భారత ప్రధాని కూడా ఆ కీలక సమావేశంలో భాగంగా ఉండేవారని నొక్కి చెప్పారు.కాంగ్రెస్ అధికారంలో ఉంటే భారత ప్రధాని కూడా ఈ బల్ల వద్ద కూర్చుని ఉండేవారు.. కాంప్రమైజ్ అయిన ప్రధాని మాత్రం ఈ బల్ల వద్ద ఎప్పటికీ కూర్చోలేరు” అని రాహుల్ గాంధీ పోస్టులో రాయడంతో చర్చనీయాంశమైంది.
నవంబర్ 19న షెన్జెన్లో APEC సదస్సు సందర్భంగా ట్రంప్, షీ జిన్పింగ్, పుతిన్ల మధ్య సమావేశం అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురు అగ్రనేతల సమావేశానికి ‘జీ3’ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ సమావేశంలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, అణ్వాయుధాల తగ్గింపు, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.దీంతోపాటు శాంతి దిశగా రష్యా-చైనా-అమెరికా దేశాధినేతల ప్రకటన పేరుతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరా పెంపు, అణు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై కలిసి పనిచేయాలని మూడు దేశాలు అంగీకరించాయి. అంతర్జాతీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలను పంచుకున్న నేతలు.. వ్యూహాత్మక స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. త్రైపాక్షిక సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన చైనాకు రష్యా, అమెరికా అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
