తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడైకెనాల్ పళని ఘాట్ రోడ్డులో సవారిక్కాడు సమపీంలో మినీ బస్సు అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడింది.గురువారం (నవంబర్ 19)రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఘాట్ పక్కకు దూసుకుపోయి లోయలో పడిందని భావిస్తున్నారు. కొడైకెనాల్ లో జరిగే ఓ పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీపంలోనిఆస్పత్రులకు తరలించారు.
#WATCH | Tamil Nadu | Three people were killed and several others injured after a 407 mini bus carrying 24 passengers plunged into a 100-foot-deep gorge near Savarikkadu on the Kodaikanal–Palani hill road in Dindigul district https://t.co/XieQhVOtFK
— ANI (@ANI) November 19, 2026
