ఈ యూనివర్సిటీలో 215 ఉద్యోగులు : జస్ట్ డిగ్రీ పాసై ఉంటే చాలు..

ఈ యూనివర్సిటీలో 215 ఉద్యోగులు : జస్ట్ డిగ్రీ పాసై ఉంటే చాలు..

ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) అసిస్టెంట్ ఖాళీల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: అసిస్టెంట్.

మొత్తం ఖాళీలు: 215. (అన్ రిజర్వ్డ్ 164, ఎస్సీ 33, ఎస్టీ 18).

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
ఇంగ్లిష్ టైపింగ్ (35 డబ్ల్యూపీఎం) లేదా హిందీ టైపింగ్ (30 డబ్ల్యూపీఎం) వచ్చి ఉండాలి.
కంప్యూటర్ అప్లికేషన్స్​లో నైపుణ్యం కలిగి ఉండాలి. 

వయసు: 32 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి.

చివరి తేదీ: నవంబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్, క్వాలిఫైయింగ్ స్కిల్ & టైపింగ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.du.ac.inను సందర్శించండి. 

ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 

మొత్తం 100 మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షకు మొత్తం 200 మార్కులు కేటాయించారు. 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు కోత విధిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఉన్నత విద్యా సంస్థల నిర్వహణపై 40 ప్రశ్నలు 80 మార్కులకు అడుగుతారు. 

మెయిన్ పరీక్ష 

డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది. ఈ పరీక్షకు మొత్తం 200 మార్కులు కేటాయించారు.   

– వెలుగు, ఎడ్యుకేషన్