హైదరాబాద్ DEPWDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత

హైదరాబాద్ DEPWDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత

హైదరాబాద్‌లోని డిపార్ట్​మెంట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (డీఈపీడబ్ల్యూడీ) వివిధ విభాగాల్లో మొత్తం 83 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు ప్రత్యేకంగా దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు కావడం వల్ల దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.   

మొత్తం ఖాళీలు: 83 (గ్రూప్–-IV: 3, క్లాస్–IV: 80).

విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్ 3, లైబ్రేరియన్ గ్రేడ్.III 1, ల్యాబ్ అటెండర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 16, వాచ్​మెన్ 8, గేట్ పోర్టర్ 4, కామటి 8, అసిస్టెంట్ ధోబీ 4, స్వీపర్ 11, మాలి 11, తోటి 9, స్కావెంజర్ 2, కుక్ 1, ఆయా 1, ఫిమేల్ వార్డ్ అటెండెంట్ 1, జూనియర్ లిఫ్ట్ అటెండెంట్ 2. 

విద్యార్హతలు

జూనియర్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు కంప్యూటర్, సంబంధిత సాఫ్ట్​వేర్ వినియోగం,  ఆఫీస్ ఆటోమేషన్‌లో నైపుణ్యం కలిగి ఉండాలి.

లైబ్రేరియన్ గ్రేడ్.III: ఇంటర్మీడియట్ లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ల్యాబ్ అటెండర్: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్​బీటీఈటీ) ద్వారా సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌తోపాటు ఐటీఐ పూర్తిచేసిన తర్వాత ఏడాది అనుభవం ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్: తప్పనిసరిగా 7వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వాచ్‌మెన్, గేట్ పోర్టర్: తప్పనిసరిగా 5వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

కామటి, అసిస్టెంట్ ధోబీ, స్వీపర్, మాలి, తోటి, స్కావెంజర్, కుక్, ఆయా, ఫిమేల్ వార్డ్ అటెండెంట్, జూనియర్ లిఫ్ట్ అటెండర్ పోస్టులకు తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లిష్ లేదా హిందీ భాషల్లో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

దివ్యాంగ అర్హతలు

కనీస వైకల్య శాతం: అభ్యర్థులకు కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి.

వినికిడి లోపం ఉన్నవారికి: వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు 75 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉంటేనే అర్హులు.
ఈ పోస్టులకు కేవలం హైదరాబాద్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది.

వయసు: 2026, జులై 1 నాటికి 18 నుంచి 54 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

 లాస్ట్‌ డేట్: డిసెంబర్ 12. 

సెలెక్షన్ ప్రాసెస్

గ్రూప్-IV పోస్టులు (జూనియర్ అసిస్టెంట్): ఎలాంటి  రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఉండవు.  డిగ్రీ మార్కులు, జిల్లా ఎంపిక కమిటీ  నిర్వహించే ఆఫీస్ ఆటోమేషన్ నైపుణ్య పరీక్ష ఆధారంగా ప్రతిభ గల అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

క్లాస్-IV పోస్టులు (50 మార్కులకు కేటాయింపు): క్లాస్-IV పోస్టుల ఎంపికను టాస్క్ ఫోర్స్ కమిటీ / జిల్లా ఎంపిక కమిటీ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. వయసుకు 15 మార్కులు, వైకల్య శాతానికి 30 మార్కులు, బహుళ వైకల్యాలకు 5 మార్కులు కేటాయించారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ hyderabad.telangana.gov.inను సందర్శించవచ్చు.

– వెలుగు, ఎడ్యుకేషన్