కూటమి పార్టీల మధ్య జెడ్పీ సీట్ల పంపకాలు ఖరారు.. టీడీపీకి 21, జనసేనకు 4, బీజేపీకి ఒకటి..!

కూటమి పార్టీల మధ్య జెడ్పీ సీట్ల పంపకాలు ఖరారు.. టీడీపీకి 21, జనసేనకు 4, బీజేపీకి ఒకటి..!

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (జడ్పీ) సీట్ల పంపకంపై కూటమి పార్టీల కసరత్తు కొలిక్కి వచ్చింది. 2026లో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో 27 జిల్లాలకు సంబంధించి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను టీడీపీ పార్టీ కార్యాలయం విడుదల చేసింది.

జిల్లాల వారీగా అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచింది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించారు. కొన్ని జిల్లాల్లో జనసేన, మరికొన్ని జిల్లాల్లో బీజేపీ నేతలకు అవకాశం ఇవ్వగా, పలు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులకు జడ్పీ పీఠాలు కేటాయించారు. దీంతో మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్లయింది.

ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు, వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపికతో కూటమి పార్టీల నేతల్లో ఆశలు చిగురించాయి. అయితే జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారికంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.

►ALSO READ | తమిళనాడు ప్రభుత్వంలో ఆంధ్రా కోవర్టులు ఉన్నారా: అందుకేనా 15 మంది అధికారులను సీఎం విజయ్ తీసేశాడు..!