పంజాబ్ కింగ్స్‌ను మార్చేసిన హార్దిక్.. పాంటింగ్ వ్యాఖ్యలు వైరల్!

పంజాబ్ కింగ్స్‌ను మార్చేసిన హార్దిక్.. పాంటింగ్ వ్యాఖ్యలు వైరల్!

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ (PBKS) ట్రేడ్ డీల్‌తో క్రికెట్ వర్గాలను షాక్ కి గురి చేసింది. ముంబై ఇండియన్స్ (MI) నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను రూ.18 కోట్ల భారీ ధరకు ట్రేడ్-ఇన్ ద్వారా దక్కించుకున్న పంజాబ్, ప్రతిగా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ను ముంబైకి ఇచ్చింది. హార్దిక్ రాకతో పంజాబ్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకం సాధించి, పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ జట్టుగా మారిందని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ధీమా వ్యక్తం చేశారు. 

పంజాబ్ జట్టులో ఆల్‌రౌండర్ల జాతర: రికీ పాంటింగ్

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జియోస్టార్ (JioStar)తో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మెగా వేలాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టులోని కోర్ గ్రూప్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించామని తెలిపారు.

* 19 మంది రిటైన్, 6 గురు రిలీజ్: ఈ మూడేళ్ల సైకిల్‌లో మెజారిటీ ఆటగాళ్లను తమతోనే ఉంచాలని భావించాం.. అందుకే ఐపీఎల్ 2027 వేలానికి ముందు కేవలం ఆరుగురు ప్లేయర్స్ ని మాత్రమే వదిలి పెట్టి, 19 మందిని రిటైన్ చేసుకున్నామని పాంటింగ్ చెప్పారు.

* హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్: ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుని, అర్ష్‌దీప్ సింగ్‌ను ట్రేడ్ చేశాం.. మా జట్టులో ఎంతమంది ఆల్‌రౌండర్లు ఉన్నారనే దానిపై చాలా చర్చ జరుగుతోంది. హార్దిక్‌తో పాటు మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, కూపర్ కొనోలీ లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్పిన్, పేస్ ఆల్‌రౌండర్లతో మా జట్టు చాలా బలంగా కనిపిస్తోందని రికీ వివరించారు. 

హెట్‌మయర్‌ను అందుకే వదిలేశాం: కుమార్ సంగక్కర

మరోవైపు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మయర్‌ను రాజస్థాన్ రాయల్స్ (RR) విడుదల చేయడంపై ఆ టీమ్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర స్పందించారు. గత ఏడాదిన్నర కాలంగా హెట్‌మయర్ తన బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చుకోవాలని ఆశిస్తున్నాడు.. మా జట్టులో ఉన్న రోల్ అవసరాలు, వేలంలో పర్స్ పెంచుకుని ఫ్లెక్సిబిలిటీ సాధించడం కోసమే అతడిని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అతడు అద్భుతమైన ప్లేయర్, ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా కష్టంగా అనిపించిందని సంగక్కర వెల్లడించాడు.