KL Rahul Record: టీమిండియా సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అజేయ అర్ధ సెంచరీ (52*) సాధించిన రాహుల్, అన్ని SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కనీసం ఒక్కసారైనా 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఆసియా దేశాల తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఓపెనర్‌గా సనత్ జయసూర్య, సయీద్ అన్వర్ లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు.
కివీస్ గడ్డపై తొలి టెస్టులోనే అద్భుతం:
న్యూజిలాండ్ గడ్డపై తన కెరీర్‌లోనే తొలి టెస్టు ఆడుతున్న కేఎల్ రాహుల్ (52*), ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (85)తో కలిసి తొలి వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 116 బంతుల్లో 5 ఫోర్లతో 52 రన్స్ చేసి రెండో రోజు ఆట ముగిసే వరకు నాటౌట్ గా నిలిచాడు. రాహుల్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (15*) క్రీజులో ఉండగా, భారత్ 159/1 పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసియా తరఫున అన్ని SENA దేశాల్లో 50+ స్కోర్లు చేసిన ఓపెనర్ల జాబితాలో సనత్ జయసూర్య, మార్వన్ అటపట్టు, దిముత్ కరుణరత్నే (శ్రీలంక), సయీద్ అన్వర్, ఇమ్రాన్ ఫర్హాత్ (పాకిస్థాన్) తర్వాత కేఎల్ రాహుల్ ఆరో ఆటగాడిగా నిలిచాడు.
గవాస్కర్ తర్వాత రాహులే:
SENA దేశాల్లో భారత ఓపెనర్ల గణాంకాలను పరిశీలిస్తే కేఎల్ రాహుల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది.
గవాస్కర్ తర్వాతి రాహులే: SENA దేశాల్లో పిచ్ కండిషన్ ల్లో ఓపెనర్‌గా ఇప్పటి వరకు 27 టెస్టుల్లో (51 ఇన్నింగ్స్) 37.87 సగటుతో 1,856 రన్స్ చేసిన కేఎల్ రాహుల్, 13 సార్లు 50+ స్కోర్లు (6 సెంచరీలు సహా) నమోదు చేశాడు. భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ (19 సార్లు 50+ స్కోర్లు, 8 సెంచరీలు) మాత్రమే రాహుల్ కంటే ముందున్నాడు.
ALSO READ : సిరాజ్ను పక్కన పెట్టటానికి అతని పేరే కారణం
* సెంచరీ కొడితే మరో చరిత్ర: కేఎల్ రాహుల్ ఖాతాలో ఇప్పటికే 7 SENA సెంచరీలు (ఇంగ్లాండ్‌లో 4, దక్షిణాఫ్రికాలో 2, ఆస్ట్రేలియాలో 1) ఉన్నాయి. మూడో రోజు ఆటలో రాహుల్ గనుక సెంచరీ పూర్తి చేస్తే.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, మహ్మద్ అజారుద్దీన్ తర్వాత నాలుగు SENA దేశాల్లోనూ శతకాలు కొట్టిన ఐదో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
