Mohammed Siraj: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టు నుంచి టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ను తప్పించడంపై క్రీడా వర్గాల్లోనే కాకుండా ఇప్పుడు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగుతోంది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయినప్పటికీ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ (Imran Masood) ఈరోజు (2026, నవంబర్ 20, శుక్రవారం) సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుత ప్రదర్శన చేస్తున్నా సిరాజ్‌ను పక్కన పెట్టడానికి అతడి పేరే కారణమా? అంటూ ఆయన ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సిరాజ్ అనే పేరే కారణం కావొచ్చు: ఎంపీ ఇమ్రాన్
వెల్లింగ్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లతో కూడిన పేస్ దళాన్ని సెలక్ట్ చేసుకున్న టీమిండియా మేనేజ్మెంట్, అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేసింది. దీనిపై స్పందించిన ఎంపీ ఇమ్రాన్ మసూద్ టీమ్ ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడి పేరు సిరాజ్– ఆ ఒక్క కారణం సరిపోదా? అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టులో చోటు దక్కకపోవడానికి, ఇదొక్కటే కారణం కావొచ్చు, ఇంతకుమించి మరో కారణం ఉండదని ఎంపీ మసూద్ ఆరోపించారు.
ఒక్క రోజు కోసం జట్టుని ఎంపికం: కోచ్ కొటక్
* మరోవైపు సిరాజ్‌ను పక్కన పెట్టడంపై వస్తున్న విమర్శలను టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ (Sitanshu Kotak) తోసిపుచ్చారు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, కెప్టెన్, జట్టు యాజమాన్యం పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బలమైన తుది జట్టును ఎంపిక చేశారని స్పష్టం చేశారు.
* బెస్ట్ ప్లేయింగ్ XI ఎంపిక: తుది జట్టును ఎంపిక చేసే బాధ్యత కెప్టెన్, మేనేజ్మెంట్పై ఉంటుంది. ఇదే అత్యుత్తమ జట్టు అని అందరూ భావించి బరిలోకి దిగాం.. ఆ నిర్ణయంలో నాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదని కొటక్ తెలిపారు.
* సుందర్ ఎందుకంటే?: న్యూజిలాండ్ టాప్ ఆర్డర్లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ (Left-handed) బ్యాటర్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు ప్రాధాన్యం ఇచ్చామని, ఈ మ్యాచ్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్ అని సితాంశు కొటక్ పేర్కొన్నారు.
Delhi: On the non-selection of pacer Mohammed Siraj in the Indian cricket team, Congress MP Imran Masood says, "His name is Siraj—isn't that reason enough? If he is performing and still not getting selected, what else could be the reason behind it? This alone can be the reason; there can be no other reason besides this"
— IANS (@ians_india) November 20, 2026
