న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రావడంతో తమ జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా మారిందని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ‘వచ్చే ఏడాది మెగా వేలం నేపథ్యంలో ఈ మూడేళ్ల సైకిల్ కోసం ఎక్కువ మందిని కలిపి ఉంచడంపై దృష్టి పెట్టాం. అందుకే 2027 సీజన్‌కు ముందు ఆరుగురు ప్లేయర్లను రిలీజ్ చేసి 19 మందిని ఉంచాం. హార్దిక్‌ను ట్రేడ్ ద్వారా తీసుకుని అర్ష్‌దీప్‌ను పంపించాం. దానివల్ల మాకు సమతూకమైన జట్టు ఏర్పడింది.
జట్టులో ఉన్న ఆల్‌రౌండర్లపై చర్చ జరుగుతోంది. యాన్సెస్, స్టోయినిస్, ఒమర్‌జాయ్, సూర్యాన్ష్ షెడ్గే, శశాంక్, కనోలిలాంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విషయంలో చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’ అని పాంటింగ్ విశ్లేషించాడు. మరోవైపు హెట్‌మయర్‌వేరే ప్లేస్‌లో బ్యాటింగ్ చేయాలని కోరుకోవడంతో అతన్ని వదులుకున్నామని రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ సంగక్కర తెలిపాడు.
