హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది. ఈ విషయాన్ని సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్న సమయమిది” అంటూ గురువారం బాబు పుట్టాడన్న విషయాన్ని తెలియజేయడంతో పాటు తనకు దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. సమంత వేలిని చిన్నారి పట్టుకున్న ఫొటోను ఈ సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ల కోసం ఈ ఇద్దరు కలిసి వర్క్ చేశారు. షూటింగ్స్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ సక్సెస్ మీట్‌లోనే తాను తల్లి కాబోతున్న విషయాన్ని సమంత ప్రకటించింది.
