పంట చివరి తడి కోసం ‘సీతారామ’ జలాలు.. రైతుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి తుమ్మల

పంట చివరి తడి కోసం ‘సీతారామ’ జలాలు.. రైతుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి తుమ్మల

ఖమ్మం, వెలుగు: పంటలు ఎండిపోకుండా చివరి తడి అందించి ఆదుకోవాలంటూ రైతులు చేసిన విజ్ఞప్తికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 

దీంతో శనివారం బీజీ కొత్తూరు పంపు హౌస్ నుంచి వైరా-ఏన్కూరు, అన్నపురెడ్డిపల్లి, రామచంద్రపురం మేజర్ కాలువలకు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ నీటిని నీటిని వృథా చేయకుండా రైతులు కేవలం పంటల సాగు అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. సాగునీటి విడుదలతో ఆయా ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.