జీవిత బీమా నమోదును వేగవంతం చేయాలి: జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీవిత బీమా నమోదును వేగవంతం చేయాలి: జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 219లో కొనసాగుతున్న నమోదు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అర్హుల నమోదు ప్రక్రియ, అధికారుల ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులందరూ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.