‘కొండగట్టు’కు పోటెత్తిన భక్తులు

‘కొండగట్టు’కు పోటెత్తిన భక్తులు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో చందనం తొలగింపు అనంతరం స్వామివారి నిజరూప దర్శనం ఆలయ అధికారులు భక్తులకు కల్పిస్తున్నారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూసి భక్తులు ఆనందంగా పరవశించిపోయారు. 

శనివారం ఒక్కరోజే సుమారు పదివేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోగా, టికెట్ల ద్వారా 7.40లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో అంజన రెడ్డి, మల్యాల ఎస్సై సందీప్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.