‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి.. గోగులు గోగులు సాంగ్ రిలీజ్

‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి.. గోగులు గోగులు సాంగ్ రిలీజ్

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం నుంచి ‘గోగులు గోగులు’ అనే పాటను విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ పాటను అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ పాడారు.

'గోగులు గోగులు గోపాలకృష్ణుడు సెలి, గోగులు గోగులు గోపాలకృష్ణుడు ఆనంద బాలుడు నందకుమారుడు, రమ్మనరే రమ్మనరే నలుగుకు నా ముద్దు గోపాలకృష్ణున్ని..’ అంటూ కొంగరి కృష్ణ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది.  వివాహ వేడుక నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు.  శివజ్యోతి,  సుజాత,  చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.