ఆకాశంలో ఒకతార సహా నాలుగు సినిమాలు లీక్ చేసింది ఇద్దరు స్టూడెంట్స్!

ఆకాశంలో ఒకతార సహా నాలుగు సినిమాలు లీక్ చేసింది ఇద్దరు స్టూడెంట్స్!
  • కొత్త సినిమాల  పైరసీ ముఠా గుట్టురట్టు
  • కర్నూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన టీజీ సీఎస్‌‌‌‌‌‌‌‌బీ
  •  విడుదలైన రోజే క్యామ్‌‌‌‌‌‌‌‌కార్డింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా రికార్డింగ్‌‌‌‌‌‌‌‌
  •  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లు, టెలిగ్రామ్ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్
  •  సినిమాకు రూ.20 వేల చొప్పున క్రిప్టో చెల్లింపులు 
  •   ఇప్పటివరకు 42,151 పైరసీ లింకులు బ్లాక్‌‌‌‌‌‌‌‌.. 
  • రూ.33.6 కోట్ల నష్టం నివారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను రహస్యంగా రికార్డు చేసి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లు, టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ చానళ్ల ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న పైరసీ ముఠాను తెలంగాణ సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌బీ) ఛేదించింది. థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యామ్‌‌‌‌‌‌‌‌కార్డింగ్ ద్వారా రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేసి పైరసీ చేస్తున్న వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లతో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌‌‌‌‌, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ యాన్స్‌‌‌‌‌‌‌‌ దందా నడుస్తున్నట్లు గుర్తించింది. ఒక్కో సినిమాను రికార్డు చేసి అందించినందుకు కమీషన్‌‌‌‌‌‌‌‌, రూ.20 వేల చొప్పున క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరుగుతున్నట్లు సీఎస్‌‌‌‌‌‌‌‌బీ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో కర్నూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులను శనివారం అరెస్టు చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించింది. 

తెలుగు సినిమాల పైరసీకి పాల్పడుతూ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తున్న వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ శుక్రవారం సీఎస్‌‌‌‌‌‌‌‌బీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆకాశంలో ఒక తార, రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలు విడుదలైన రోజే పైరసీ అయినట్లు పోలీసులకు ఆధారాలు అందించింది. నాలుగు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాలు ఉన్నట్లు తెలిలిపింది. ఆయా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ల లింకులను సీఎస్‌‌‌‌‌‌‌‌బీ పోలీసులకు అందించింది. ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ఛాంబర్స్ ఫిర్యాదు మేరకు సీఎస్‌‌‌‌‌‌‌‌బీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు థియేటర్‌‌‌‌‌‌‌‌లో విడుదలైన ఆకాశంలో ఒక తార సినిమాను క్యామ్‌‌‌‌‌‌‌‌కార్డింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలను కూడా పైరసీ చేసినట్లు ఆధారాలు సేకరించారు.

కర్నూల్‌‌‌‌‌‌‌‌లోని రెండు థియేటర్లలో రికార్డింగ్‌‌‌‌‌‌‌‌.. 

వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ లింకుల ఆధారంగా కర్నూల్‌‌‌‌‌‌‌‌ సంతోష్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన షేక్‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌(19), కప్పలనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాంపోగు అజయ్‌‌‌‌‌‌‌‌ (19)ను శనివారం అరెస్ట్ చేశారు. వీరిద్దరు కర్నూలులోని ఎస్‌‌‌‌‌‌‌‌వీసీ సినిమాస్‌‌‌‌‌‌‌‌, సిటీ స్క్వేర్‌‌‌‌‌‌‌‌ మాల్‌‌‌‌‌‌‌‌ థియేటర్లలో విడుదల అయ్యే కొత్త సినిమాలను రహస్యంగా రికార్డు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని Gofile.comలో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసి, టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా పైరసీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు పంపేవారు. ఇలా పైరసీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ నుంచి go2.india4movies.click వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఇతరులతో సమన్వయం చేసుకుంటూ పైరసీ కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు.

పైరసీ సైట్లలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌‌‌‌‌, బెట్టింగ్ యాప్‌‌‌‌‌‌‌‌లు..

కొత్తగా విడుదలయ్యే సినిమాలే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా ఈ పైరసీ రాకెట్ నడిచినట్టు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఆకాశంలో ఒకతార సహా రామాయణం, సీన్‌‌‌‌‌‌‌‌, మహాశక్తి, ఈ నగరానికి ఏమైంది, ఓం, కల్ట్‌‌‌‌‌‌‌‌, ఆదర్శ కుటుంబం తదితర సినిమాలు ఈ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ద్వారా పైరసీకి గురైనట్లు గుర్తించారు. ఇలా పైరసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ల ప్రచారం ద్వారా కమీషన్లు కూడా పొందుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు సీఎస్‌‌‌‌‌‌‌‌బీ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. కాగా, కేవలం క్యామ్‌‌‌‌‌‌‌‌కార్డింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా పైరసీ చేసే అవకాశం లేకపోవడంతో ఈ పైరసీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ వెనుక ఉన్న కీలక సూత్రదారుల కోసం సీఎస్‌‌‌‌‌‌‌‌బీ గాలిస్తోంది.

42,151 పైరసీ లింకులు బ్లాక్‌‌‌‌‌‌‌‌..

తెలుగు చిత్ర పరిశ్రమ సహకారంతో టీజీ సీఎస్‌‌‌‌‌‌‌‌బీ ఈ ఏడాది జనవరి 5న యాంటీ పైరసీ యూనిట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌‌‌‌‌‌‌‌ ఇప్పటివరకు 42,151 పైరసీ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌లను బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు ప్రధాన హోస్టింగ్‌‌‌‌‌‌‌‌ సర్వర్లకు 87 నోటీసులు జారీ చేసింది. 8 మంది అనుమానితులను గుర్తించి, ఐదుగురిని అరెస్టు చేసింది. గత ఏడు నెలల్లో 20కి పైగా సినిమాల పైరసీని అడ్డుకోవడం ద్వారా సుమారు రూ.33.6 కోట్ల నష్టం నివారించినట్లు సీఎస్‌‌‌‌‌‌‌‌బీ అధికారులు వెల్లడించారు.