- రూ.14.36 కోట్ల సీఎంఆర్ పక్క దారి రైస్ మిల్లర్ అరెస్ట్..
- నిర్మల్ జిల్లాలో శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రైస్ మిల్లులో 3,925 టన్నుల ధాన్యం అక్రమ నిల్వ
- ప్రభుత్వం 4,160 టన్నులు ఇవ్వగా.. తిరిగి ఇచ్చింది 28.88 టన్నులే
- రైస్ మిల్లర్ అరెస్ట్
నిర్మల్, వెలుగు: ప్రభుత్వానికి అప్పగించాల్సిన రూ.14.36 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్‌మిల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. కడెం మండలం పెద్దూరు శివారులోని శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రైస్ మిల్లులో 3,925 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో మిల్లు యజమాని గుండ ప్రసాద్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
2025-2026 రబీ సీజన్‌లో సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖ ఈ మిల్లుకు 4,160.16 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. ఒప్పందం ప్రకారం 2,787.31 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు కేవలం 28.88 మెట్రిక్ టన్నులే ఇచ్చాడు. దీంతో తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా ధాన్యం అక్రమ నిల్వను గుర్తించారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సుధాకర్ కడెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
