మడతపెట్టే ఐఫోన్ వచ్చేసింది

మడతపెట్టే ఐఫోన్ వచ్చేసింది

ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్​ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ను విడుదల చేసింది. పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఆకారంలోని ఈ డివైజ్‌‌‌‌‌‌‌‌లో 7.6 ఇంచెస్ ఇన్నర్, 5.4 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. రెండూ 120 హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తాయి. ఏ20 ప్రో చిప్‌‌‌‌‌‌‌‌సెట్, టైటానియం ఫ్రేమ్, సెరామిక్ షీల్డ్ రక్షణతో వచ్చే ఈ ఫోన్ బరువు 254 గ్రాములు. టచ్ ఐడీతో పాటు ఐఓఎస్ 27.3 బీటా ద్వారా ఫేస్ ఐడీ కూడా వచ్చింది.

48 ఎంపీ మెయిన్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు; ‘డ్యూయో ప్రివ్యూ’, ‘కిడ్ క్యూ’ ప్రత్యేక ఆకర్షణలు. 4,883 ఎంఏహెచ్ బ్యాటరీ 35 డబ్ల్యూ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌తో 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. భారత్‌‌‌‌‌‌‌‌లో 256 జీబీ మోడల్ ధర రూ. 2,99,900. అమెరికా ధర ($1,999) కంటే ఇది దాదాపు రూ. లక్ష ఎక్కువ. ఫోల్డబుల్ విభాగంలో శాంసంగ్‌‌‌‌‌‌‌‌కు ఇది గట్టి పోటీనివ్వనుంది.