వికారాబాద్: వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీ కొట్టి నలుగురి మృతి చెందారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బుగ్గరామేశ్వరం సమీప మలుపు వద్ద ఆటో, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. వికారాబాద్ పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
