- తిలక్ పోరాటం వృథా..ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత్-ఎ ఓటమి..48 రన్స్‌తో పాక్-ఎ గెలుపు
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాక్-–ఎతో జరిగిన గ్రూప్ –బి మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు పోరాడి ఓడారు. దాయాది జట్టు నిర్దేశించిన 313 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక భారత్ –ఎ జట్టు 265 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో 48 పరుగుల తేడాలో పాక్ టీమ్ గెలుపొందింది. చేజింగులో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 రన్స్‌తో మెరుపు ఆరంభమివ్వగా, వైభవ్ సూర్యవంశీ (11) మరోసారి నిరాశపరిచాడు.
మిడిలార్డర్ లో షాబాద్ 56 రన్స్ తప్పా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 100 పరుగులతో తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు. పాక్ బౌలింగులో అలీ రజా 3 వికెట్లు, హసన్ నవాజ్ 3, ఇమ్రాన్ 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు పాక్ బ్యాటర్లు సన్ నవాజ్ 79, మాజ్ సదాఖత్ 59, ఫర్హాన్ యూసుఫ్ 56 రన్స్‌తో రాణించారు.
