- స్క్వాష్ కింగ్ అభయ్..మహిళల విభాగంలో ఆకాంక్షకు తొలి జాతీయ టైటిల్
ముంబై: జాతీయ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో అభయ్ సింగ్ (తమిళనాడు), ఆకాంక్ష సాళుంఖే (గోవా) విజేతలుగా నిలిచారు. ఒట్టర్స్ క్లబ్ వేదికగా ఆదివారం జరిగిన హెచ్‌సీఎల్ 82వ నేషనల్ ఛాంపియన్షిప్ పురుషుల ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 26వ ర్యాంకర్ అభయ్ 11-6, 11-4, 11-9తో రెండో సీడ్ వీర్ చోట్రానీ (ముంబై)ని చిత్తు చేశాడు.
వరుసగా ఐదో ఫైనల్ ఆడిన అభయ్‌కి ఇది మూడో జాతీయ టైటిల్. ఇక మహిళల తుదిపోరులో క్వాలిఫయర్ ఆకాంక్ష సాళుంఖే 11-6, 11-4, 11-4తో షమీనా రియాజ్ (తమిళనాడు)పై విజయం సాధించింది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన ఆకాంక్ష.. వరుసగా మూడో ఫైనల్ ఆడి ఎట్టకేలకు తొలి సీనియర్ జాతీయ టైటిల్‌ను ముద్దాడింది.
