పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో మలయాళంలోకి నిధి అగర్వాల్

పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో మలయాళంలోకి నిధి అగర్వాల్

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో హీరోయిన్‌‌గా ఆకట్టుకున్న నిధి అగర్వాల్ ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.  ‘గురువాయూర్ అరంగేట్టం’ అనే పాన్ ఇండియా చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్ ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.  మలయాళ నటుడు, నిర్మాత ఉన్ని ముకుందన్‌‌కు చెందిన ‘ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్’ సంస్థ.. మహా గణపతి మూవీస్‌‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  

రాజీవ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రఖ్యాత గురువాయూర్ ఆలయ నేపథ్యంలో ప్రేమ, భక్తి అంశాల కలబోతతో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ఇది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్‌‌కు మలయాళ ఇండస్ట్రీలోనైనా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి!